తెలంగాణ సీఎస్ శాంతికుమారి తీరుపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నాక తనను కలవలేదంటూ ట్వీట్ చేశారు. రాజభవన్‌కు రావడానికి కూడా టైం లేదా? అని ప్రశ్నించారు. కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ కూడా పాటించలేదన్నారు. ఢిల్లీ కంటే రాజభవన్ దగ్గరగా ఉందంటూ ట్వీట్ చేశారు గవర్నర్ తమిళిసై. పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వెళ్లడంపై గవర్నర్ పరోక్ష విమర్శలు చేశారు