TS : పోతారం బ్యాక్ వాటర్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు : రేవంత్
లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం నిర్మించిన కేసీఆర్.. ఇక్కడి ప్రజల సమస్యలు ఎందుకు తీర్చడం లేదని ప్రశ్నించారు;
పోతారం చెరువు బ్యాక్ వాటర్ వల్ల సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.. పోతారం చెరువును పరిశీలించిన రేవంత్ రెడ్డి.. ప్రజలు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.. వానాకాలంలో రాకపోకలకు ఇక్కడి గ్రామాల ప్రజలకు అంతరాయం ఏర్పడుతోందన్నారు.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కోనాపూర్‌లో 135 కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు.. మత్తడి నిర్మాణం పూర్తి కాలేదనే సాకుతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం లేదని మండిపడ్డారు.. లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం నిర్మించిన కేసీఆర్.. ఇక్కడి ప్రజల సమస్యలు ఎందుకు తీర్చడం లేదని ప్రశ్నించారు.. తక్షణమే ఈ దారిలో బ్రిడ్జి నిర్మించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సమస్యలను గ్రామస్తులు, రైతులతో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తారని.. పనులు పూర్తిచేయకుంటే వచ్చే సోమవారం నుంచి కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం జరుగుతుందని చెప్పారు.