TS : కలిసికట్టుగా నడవాలి.. అధికారంలోకి రావాలి : రేవంత్ రెడ్డి

Update: 2023-04-08 12:20 GMT

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు నేతలంతా కలిసికట్టుగా పని చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో కలిసి పాల్గొన్న రేవంత్ రెడ్డి.. రాబోయే 8 నెలలు విశ్రాంతి లేకుండా పని చేయాలని పిలుపు నిచ్చారు. నేతలంతా వారికి కేటాయించిన బాధ్యతలను పకడ్బందీగా నిర్వర్తించాలన్నారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ ఎవరి కోసం పని చేస్తున్నాయో కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నేతలపైనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

Similar News