తన ఫోన్ వెతికి పెట్టమంటూ కరీంనగర్ పోలీసులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. మిస్ అయిన ఐఫోన్ వెతికి పెట్టాలని బండి సంజయ్ పోలీసులకు కంప్లయింట్ చేశారు.. 76800 06600 నంబరు గల ఐ ఫోన్ మిస్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.. బండి సంజయ్ ఫోన్ మిస్సింగ్ వ్యవహారం వివాదంగా మారింది.. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో ఇటీవల బండి సంజయ్‌ని అరెస్టు చేసిన సమయంలో ఫోన్ ఇవ్వాలని పోలీసులు ఆయన్ను కోరారు.. తప్పు చేయకపోతే ఫోన్ ఎందుకు ఇవ్వలేదని బీఆర్‌ఎస్ నేతలు కూడా బండి సంజయ్‌ని నిలదీశారు.. తాజాగా తన ఫోన్ మిస్ అయిందని బండి సంజయ్ పోలీసులకు కంప్లయింట్ చేశారు.. అయితే, పోలీసుల తీరుపైనే ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. సిద్దిపేట వరకు వున్న ఫోన్ తర్వాత ఏమైందని ఆయన ప్రశ్నిస్తున్నారు.. అటు కోర్టులోనూ ఇవే వాదనలు వినిపించారు బండి సంజయ్ తరపు న్యాయవాదులు.