Bandi Sanjay : ఉమ్మడి నల్గొండలో 2వ రోజు కొనసాగుతున్న బండి సంజయ్ పర్యటన
Bandi sanjay : నిన్న రోజంతా ఘర్షణలు, రాళ్లదాడులు, తోపులాటలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో.. ఇవాళ్టి టూర్ ఎలా సాగుతుందనేది టెన్షన్ పుట్టిస్తోంది.;
Bandi Sanjay : ఉమ్మడి నల్గొండలో 2వ రోజు బండి సంజయ్ పర్యటన కొనసాగుతోంది. నిన్న రోజంతా ఘర్షణలు, రాళ్లదాడులు, తోపులాటలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో.. ఇవాళ్టి టూర్ ఎలా సాగుతుందనేది టెన్షన్ పుట్టిస్తోంది. ఇవాళ సూర్యాపేట, జనగామ జిల్లాల్లో ఐకేపీ సెంటర్లు పరిశీలించనున్నారు సంజయ్. మంత్రి జగదీష్‌రెడ్డి నియోజకవర్గంలో పర్యటన నేపథ్యంలో.. TRS కార్యకర్తలు బండిని అడ్డుకుని తీరతామంటున్నారు. జనగామలో అడుగుపెడితే అక్కడా ప్రతిఘటించేందుకు మంత్రి ఎర్రబెల్లి వర్గీయులు రెడీ అంటున్నారు. ఈ పోటాపోటీ సవాళ్లు, టూర్ల నేపథ్యంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రబీ ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వకుండా పర్యటనలు చేస్తే.. ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని గులాబీశ్రేణులు మండిపడుతున్నారు. అటు, బండి టూర్‌కి మద్దతుగా వివిధ జిల్లాల నుంచి సూర్యాపేట బయలుదేరిన నేతలను హౌస్ అరెస్టులు చేయడం పట్ల BJP ముఖ్యనేతలు మండిపడుతున్నారు.