బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని నర్సంపేట వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.;
ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి సునీల్ మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రామ్‌సింగ్ తండాలో ఉద్రిక్తత నెలకొంది. సునీల్‌కు న్యాయం చేసే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అంబులెన్స్ ఎదుట బైఠాయించారు. జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామస్థులు, పోలీసులకు మధ్య వాగ్వాగం తోపులాటకు దారి తీసింది.
అటు.. తేజావత్ రామ్‌సింగ్ తండాలో గ్రామస్థులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొనేందుకు బయల్దేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని నర్సంపేట వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.