RESULT: ఈఏపీ సెట్ ఫలితాల్లో బాలుర సత్తా
తొలి పది ర్యాంకుల్లో తొమ్మిది కైవసం... సత్తా చాటిన ఏపీ విద్యార్థులు;
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్ ర్యాంకుల్లో బాలురు సత్తా చాటారు. తొలి పది ర్యాంకుల్లో తొమ్మింటిని కైవసం చేసుకున్నారు. ఎప్ సెట్ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. మెడికల్ విభాగం నీట్ లోకి వెళ్లిన తర్వాత తొలిసారి E.A.P సెట్ పేరుతో నిర్వహించిన ఎప్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి.మొత్తం 3 లక్షల 32 వేల 251 మంది విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్ , ఫార్మసీలో 89 శాతం మంది విద్యార్థుల ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ ర్యాంకుల్లో అబ్బాయిలు సత్తా చాటినట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
ఈఏపీ సెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్‌తో పాటు అగ్రికల్చర్ , ఫార్మసీలోనూ మొదటి రెండు ర్యాంకులూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే దక్కాయి. ఆయా విభాగాల్లో తొలి 10 ర్యాంకుల్లో ఐదేసి చొప్పన మన రాష్ట్ర విద్యార్థులే సొంతం చేసుకున్నారు.మెడికల్ విభాగం నీట్ లోకి వెళ్లిన తర్వాత తొలిసారి తెలంగాణలో E.A.P సెట్ పేరుతో నిర్వహించిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.మొత్తం 3 లక్షల 32 వేల 251 మంది విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్ , ఫార్మసీలో 89 శాతం మంది విద్యార్థుల ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ ర్యాంకుల్లో తొలి 10 ర్యాంకుల్లో అబ్బాయిలే సత్తా చాటినట్లు తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. వారం రోజుల్లోనే అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేస్తామని బుర్రా వెంకటేశం తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఆన్ లైన్ వేరిఫికేషన్ ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు.