కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమలాకర్‌రెడ్డిని సస్పెండ్ చేసిన బీజేపీ
కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమలాకర్‌రెడ్డిని బీజేపీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. దుబ్బాక టికెట్ ఆశించిన కమలాకర్‌రెడ్డి... టికెట్ రాకపోవడంతో బీజేపీ లీడర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. కమలాకర్‌రెడ్డి వ్యవహారంపై.. పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆదేశాలతో... సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ కార్యాలయ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ క్రమశిక్షణరాహిత్యంతో వ్యవహరించినందున సస్పెండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.