TSPSC Group 1 : మరికొన్ని రోజుల్లోనే టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష..
TSPSC Group 1 : తెలంగాణలో అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది;
TSPSC Group 1 : తెలంగాణలో అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. పరీక్ష నిర్వహణపై TSPSC ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. దీంతో కలెక్టర్లు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 503 పోస్టులకు 3లక్షల 80వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 756 మంది చొప్పున పోటీపడుతున్నారు.
గ్రూప్-1 ప్రకటనలో మొత్తం 503 పోస్టుల్లో మహిళలకు 225 రిజర్వ్ అయ్యాయి. వీటికి లక్షా 51వేల మంది దరఖాస్తు చేయగా.. ఒక్కో పోస్టుకు 672 మంది పోటీపడుతున్నారు. ఇక.. పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయన్నారు.