TSRTC: సంక్రాంతికి 4వేల బస్సులు.. ఛలో సొంతూరు

TSRTC: 585 బస్సు సర్వీసులకు అడ్వాన్స్‌డ్ టికెట్ బుకింగ్‌ను 30 రోజుల నుండి 60 రోజులకు పెంచి ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది టీఎస్‌ఆర్టీసీ. ఈ అవకాశం జూన్ 2023 వరకు అందుబాటులో ఉంటుంది.

Update: 2022-12-10 08:59 GMT

TSRTC: 585 బస్సు సర్వీసులకు అడ్వాన్స్‌డ్ టికెట్ బుకింగ్‌ను 30 రోజుల నుండి 60 రోజులకు పెంచి ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది టీఎస్‌ఆర్టీసీ. ఈ అవకాశం జూన్ 2023 వరకు అందుబాటులో ఉంటుంది.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) 2023 సంక్రాంతి సందర్భంగా జనవరి 7 నుండి 15 వరకు 4,233 ప్రత్యేక బస్సులను నడపనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల మధ్య ఈ ప్రత్యేక బస్సులు పనిచేస్తాయి.

ప్రయాణీకుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన రవాణాపై TSRTC మేనేజింగ్ డైరెక్టర్, VC సజ్జనార్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్రాంతికి, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది TSRTC 10 శాతం బస్సులను అదనంగా నడుపుతోందని చెప్పారు. అమలాపురంకు 125, కాకినాడకు 117, కందుకూరుకు 83, విశాఖపట్నంకు 65, పోలవరానికి 51, రాజమండ్రికి 40 ప్రత్యేక బస్సులను కేటాయించినట్లు టిఎస్‌ఆర్‌టిసి ఒక ప్రకటనలో తెలిపింది.

Tags:    

Similar News