TSRTC: శ్రీవారి భక్తులకు టీఎస్ఆర్టీసీ ఎండీ తీపికబురు..

TSRTC: శ్రీవారి భక్తులకు స్వామి దర్శనం మరింత సులువు చేసేందుకు టీఎస్ఆర్టీసీ తీపి కబురు అందించింది.

Update: 2022-07-01 06:02 GMT

TSRTC: శ్రీవారి భక్తులకు స్వామి దర్శనం మరింత సులువు చేసేందుకు టీఎస్ఆర్టీసీ తీపి కబురు అందించింది. దర్శనం కోసం మళ్లీ సెపరేట్‌గా టికెట్లు బుక్ చేసుకునే పనిలేకుండా బస్ టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే దర్శనం టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించనుంది.

ఈ సౌకర్యం భక్తులకు జులై 1వ తేదీనుంచే అమలు కానున్నట్లు తెలియజేసింది. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రతి రోజు వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. టీఎస్ఆర్టీసీ, తితిదే మధ్య ఈ మేరకు అంగీకారం కుదిరిందని వివరించారు.

బస్ టికెట్ రిజర్వ్ చేసుకునే సమయంలోనే దర్శనం టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆర్టీసీ వెబ్‌సైట్ లేదా అధీకృత డీలర్ ద్వారా రిజర్వు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్‌లైన్ లేదా టికెట్ బుకింగ్ కౌంటర్లలో ప్యాకేజీ కోసం కనీసం వారం ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. 

Tags:    

Similar News