TG : తుమ్మల చెరువు మిస్సింగ్.. గ్రామస్తులతో కలిసి ఫిర్యాదు

Update: 2024-08-27 05:45 GMT

తుమ్మల చెరువు జాడ కనిపించట్లేదని పహాడీషరీఫ్‌ పోలీసు స్టేషన్‌లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సెగ్మెంట్ ఇన్ చార్జి అందెల శ్రీరాములు గ్రామస్తులతో కలిసి ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో 8 ఎకరాల్లో ఉండాల్సిన చెరువు కనిపించట్లేదని అందులో పేర్కొన్నారు. కబ్జా చేసి వెంచర్లు వేశారని ఆరోపించారు. దీంతో పంటలు మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి చెరువు ఆచూకీ కనిపెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయామని గ్రామస్తులు ఆరోపించారు. అనంతరం అందెల శ్రీరాములు మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంలో చెరువులు కబ్జాకు గురవుతున్నాయన్నారు. ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరులు 15 ఏండ్లుగా బడంగ్ పేట, మీర్ పేట, జల్ పల్లి కార్పొరేషన్ల పరిధిలోని చెరువులను కబ్జాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Tags:    

Similar News