Tunnel Accident : టన్నెల్ ప్రమాదం.. ఏడుగురి కోసం గాలింపు!

Update: 2025-02-22 12:45 GMT

శ్రీశైలం ఎడమ కాలువలోని SLBC టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 50 మంది చిక్కుకోగా ఇప్పటివరకు 43 మందిని బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మరో ఏడుగురి కోసం గాలింపు కొనసాగుతున్నట్లు సమాచారం. ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరా తీశారు.

శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ప్రమాదంపై ఎస్పీ వైభవ్ గైక్వాడ్ స్పందించారు. ప్రమాద సమయంలో 50 మంది కార్మికులు ఉన్నారని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆయన అక్కడికెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడి చేరుకోనున్నారు.

శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. వెంటనే అక్కడికెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని నల్గొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులను ఆదేశించారు. మంత్రి ఉత్తమ్, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు హెలికాప్టర్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు.

Tags:    

Similar News