అరుదైన వేడుక.. ట్విన్ సిస్టర్స్‌కు ట్విన్ బ్రదర్స్‌తో మ్యారేజ్

Update: 2020-12-12 09:48 GMT

అచ్చం సినిమాను తలపించే రియల్‌ మ్యారేజ్‌ ఇది. కవల బ్రదర్స్‌కు.. కవల సిస్టర్స్‌తో ఒకే వేదికపై పెళ్లి జరిగింది. చాలా అరుదగా కనిపించే ఈ వివాహ వేడుక చూసి జనమంతా ఆశ్చర్యపోయారు. ఈ కల్యాణ వేడుక మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరిలో జరిగింది.

వెంకటగిరి గ్రామానికి చెందిన అంబాల మహేష్‌, నరేష్‌లు కవలలు. కురవి మండలం నేరడ గ్రామానికి చెందిన శాంతి, హిమలు కూడా కవలలే. మహేష్‌, శాంతి గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. దీంతో ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. ఈ సమయంలోనే నరేష్‌, హిమలకు కూడా వివాహం జరిపించాలని బంధువర్గం అభిప్రాయం కోరగా.. దానికి వారిద్దరూ అంగీకరించారు. ఇంకేముంది ఒకే వేదికపై కవల జంటలకు అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఈ పెళ్లి వేడుకకు బంధువులంతా తరలివచ్చి ఆ జంటలతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు.

Tags:    

Similar News