Nizamabad: నిజామాబాద్‌లో గొడవ.. 4 నెలల పసికందు కోసం ఇద్దరు తల్లుల ఆరాటం..
Nizamabad: కన్నపేగు కోసం ఒకరు, పెంచిన ప్రేమ కోసం మరొకరు.. నాలుగునెలల పసికందు కోసం ఇద్దరు తల్లులు గొడవకు దిగారు.;
Nizamabad: కన్నపేగు కోసం ఒకరు, పెంచిన ప్రేమ కోసం మరొకరు.. నాలుగునెలల పసికందు కోసం ఇద్దరు తల్లులు గొడవకు దిగారు. నాకొడుకంటే నాకొడుకంటూ వాదులాడుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు పసికందును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. నిజామాబాద్ పట్టణంలోని అనంద్ నగర్‌కు చెందిన సునీతకు సంతానం లేకపోవడంతో.. రెండు నెలల కిందట బాబును కొనుగోలు చేశారు.
ఇందుకోసం పసికందు తల్లిదండ్రులకు 40 వేలు చెల్లించారు. తాజాగా తమ కొడుకును తమకు ఇచ్చేయాలంటూ సునీత ఇంటిముందు ఆందోళనకు దిగింది కన్న తల్లి ఇందిర. దీంతో బాబు కోసం పెంపుడు తల్లి, కన్నతల్లి వాదులాటకు దిగారు. ఈ వివాదం రచ్చకెక్కడంతో ఘటనాస్థలికి పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు చేరుకుని బాబును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పసికందు కొనుగోలు అంశంపై విచారణ చేపట్టారు.