Nizamabad: నీళ్లు అనుకుని యాసిడ్ తాగారు.. నిజామాబాద్‌లోని షాపింగ్ మాల్‌లో ఘటన..
Nizamabad: నీళ్లు అనుకుని యాసిడ్ తాగి ఇద్దరు ఆసుపత్రిపాలైన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది.;
Nizamabad: నీళ్లు అనుకుని యాసిడ్ తాగి ఇద్దరు ఆసుపత్రిపాలైన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా మహ్మద్‌నగర్‌కు చెందిన విజయ్ కుమార్ పెళ్లి బట్టల కొనుగోలు కోసం గాంధీచౌక్‌లోని ఓ షాపింగ్‌మాల్‌కు వెళ్లాడు. అక్కడ దాహం వేయడంతో సేల్స్‌మన్‌ను నీళ్లు అడిగాడు. సెల్స్ మన్ పక్కనే ఉన్న బాటిల్ ఇవ్వడంతో విజయ్‌కుమార్ అందులోనివి నీళ్లు అనుకుని తాగాడు. అతనితో పాటు సేల్స్‌మన్ కూడా వాటినే సేవించాడు. కొద్దిసేపటికే ఇద్దరూ అస్వస్థతకు గురికాగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.