Job Mela : జాబ్ మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు.. వరంగల్ లో తొక్కిసలాట

Update: 2025-04-12 12:30 GMT

తెలంగాణలోని వరంగల్ లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు నిరుద్యోగులు పోటె త్తారు. 50 కంపెనీలు, 2 వేల ఉద్యోగాలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఫుల్ ప్రచారం చేశారు. కానీ ఏర్పాట్లు మాత్రం మరిచారు. నిరుద్యోగులు ఫంక్షన్ హాల్ వద్దకు వేలాది గా నిరుద్యోగులు చేరుకోగా ప్రధాన ద్వారం తొక్కిసలాట జరిగింది. అద్దం ధ్వంసమై ముగ్గురు యువతులకు గాయాలయ్యాయి. వారిని పోలీసులు సమీప ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించి జాబ్ మేళాలో ఇంటర్వ్యూ పాల్గొనేలా చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News