Bandlaguda: హోటల్‌లో కుళ్లిన మాంసాహారం.. కస్టమర్ ఫిర్యాదుతో..
Bandlaguda: ఆకలేస్తే ఆర్డరేయడమే ఇప్పుడు నడుస్తున్న స్టైల్.;
Bandlaguda (tv5news.in)
Bandlaguda: ఆకలేస్తే ఆర్డరేయడమే ఇప్పుడు నడుస్తున్న స్టైల్. ఏ రెస్టారెంట్‌కో, హోటల్‌కో వెళ్లి చికెన్ బిర్యానీయో, మటన్ బిర్యానీయో ఆర్డరిచ్చి లాగించేయడమే లేటెస్ట్ ట్రెండ్. రెస్టారెంట్‌కు వెళ్లే ఓపిక లేకపోతే స్విగ్గీ, జొమోటో లాంటి ఆన్‌లైన్ ఫుడ్ సంస్థలు ఎలానూ ఉన్నాయి. పేద, మద్య తరగతి ప్రజల ఈ చిన్ని ఆశను క్యాష్ చేసుకుంటున్నాయి కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్.
కుళ్లిన మాంసహార పదార్థాలను కస్టమర్లకు సరఫరా చేస్తున్నాయి. ఈ దందా ఎక్కడో అక్కడ బయటపడుతున్నా రెస్టారెంట్లకు క్రేజీ తగ్గడం లేదు. తాజాగా.. కుళ్లిపోయిన మాంసహారాన్ని సరఫరా చేస్తున్న బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓ రెస్టారెంట్‌పై అధికారులు దాడులు నిర్వహించారు. బండ్లగూడ చౌరస్తా వద్ద ఉన్న జస్ట్ డ్రైవ్ ఇన్ హోటల్‌పై మున్సిపల్ సిబ్బంది ఆకస్మికంగా తనిఖీ చేశారు.
హోటల్ నిర్వాహకులు.. కుళ్లిపోయిన ఆహార పదార్థాలను కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఓ కస్టమర్ ఇచ్చిన ఫిర్యాదుతో మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించి కుళ్లిపోయిన మాంసహారంతో పాటు పలు రకాల ఆహార పదార్థాలను సీజ్ చేశారు. వాటిని పరీక్షల నిమిత్తం తరలించారు. మొదటి తప్పుగా భావించి హోటల్ యాజమన్యానికి 5వేల రుపాయల జరిమానా విధించారు.