గాంధీ, కింగ్‌కోఠి ఆస్పత్రుల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తనిఖీలు..
తొలుత గాంధీ ఆస్పత్రిని పరిశీలించిన ఆయన.. కోవిడ్ రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ వివరాలు, చికిత్సా విధానం, వ్యాక్సిన్ల వివరాలపై వైద్యులతో మాట్లాడారు.;
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఆస్పత్రులను సందర్శించారు. తొలుత గాంధీ ఆస్పత్రిని పరిశీలించిన ఆయన.. కోవిడ్ రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ వివరాలు, చికిత్సా విధానం, వ్యాక్సిన్ల వివరాలపై వైద్యులతో మాట్లాడారు. అనంతరం గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గాలితో ఆక్సిజన్ తయారు చేసే పీఎస్ఏ యూనిట్‌ను సందర్శించారు. అటు కింగ్ కోటి ఆస్పత్రికి వెళ్లిన కిషన్‌రెడ్డి.. కోవిడ్ సెంటర్‌ను సందర్శించారు. ఆస్పత్రిలో కరోనా పేషెంట్లకు అందిస్తున్న చికిత్సా వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు కిషన్‌రెడ్డి సూచించారు.