TG : ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి : వంటేరు ప్రతాపరెడ్డి

Update: 2024-10-31 08:30 GMT

ప్రజలందరూ లక్ష్మీదేవి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని పాడిపంటలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఎటుచూసిన ధర్నాలతో, రాస్తారోకోలతో, నిరసనలతో అట్టుడుకుతుందన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయలేదన్నారు. పోలీసులు రోడ్డు మీదికి వచ్చి ధర్నాలు, నిరసనలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని వంటేరు ప్రతాపరెడ్డి మండిపడ్డారు.

Tags:    

Similar News