Veera Raghavareddy : రంగరాజన్ పై దాడి చేయడం తప్పే.. నిందితుడు వీర రాఘవరెడ్డి వాంగ్మూలం

Update: 2025-02-21 09:00 GMT

చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి పోలీసుల విచారణలో కీలక విషయాలను వెల్లడించాడు. మూడు రోజులుగా కొనసాగుతున్న విచారణలో ఆయన తన చర్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. రంగరాజనైపై దాడి చేయడం తప్పే అని అంగీకరించిన వీర రాఘవరెడ్డి, ఆ సంఘటనకు కారణాలను వివరించాడు. పోలీసుల ప్రశ్నలకు సమాధానమిస్తూ వీరరాఘవరెడ్డి తన చర్యను సమర్థించుకోలేనని, ఇకపై శాంతియుతంగా రామరాజ్య స్థాపన కోసం పనిచేస్తానని చెప్పాడు. తన వెంట వచ్చిన అనుచరులు ముందు తనను చిన్నచూపు చూశారని, ఆ ఒత్తిడిలోనే దాడికి దిగాల్సి వచ్చిందని వెల్లడించాడు. తాను చేసిన దాడికి చింతిస్తున్నానని, రంగరాజన్పై దాడి చేయడం బుద్ది తక్కువ పనే అని అంగీకరించాడని పోలీసులు చెబుతున్నారు. తన చర్యలను తాను సమర్థించుకోనని, ఇకపై ఇటువంటి చర్యలకు పాల్పడనని వీరరాఘవ రెడ్డి విచారణలో పోలీసులకు తెలిపాడు.

Tags:    

Similar News