Vimalakka : వీరవనిత రంగవల్లి .. ఆమె జీవితం నేటితరానికి స్ఫూర్తిదాయకం : విమలక్క
దొరల పాలనకు వ్యతి రేకంగా పోరాటం చేసిన గొప్ప మహిళ రంగవల్లి అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివా స్ అన్నారు. ఇవాళ వేములవాడ నంది కమాన్ వద్ద నిర్మించిన రంగవల్లి విజ్ఞాన కేంద్రాన్ని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్కలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. రంగవల్లి జ్ఞాపకార్థంగా ప్రజాప్రభుత్వంలో విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించుకోవడం సంతో షకరంగా ఉందన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమ లక్క మాట్లాడుతూ.. ‘నిజం కాలం నుండి పోరాటం చేసిన గొప్ప మహిళ రంగవల్లి. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో పనిచేస్తూ సమాజంలో ఉన్న అసమానతలకు వ్యతిరే కంగా పోరాటం చేస్తూ, అదివాసి బిడ్డల కు అండగా నిలబడ్డారు. భూస్వాములకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు. రంగవల్లి జీవితం నేటి తరానికి స్ఫూర్తి దాయకం. ప్రగతి శీల సంఘంలో, విప్లవ పార్టీలో కొనసాగుతూ పేద ప్రజల కోసం అనేక పోరాటం చేసి గొప్ప వ్యక్తి. పార్టీలు వేరైనా భావాలు వేరైనా అందరం ప్రజా సమస్యలపై పోరాటాలు చేశాం. రంగవ ల్లి విజ్ఞాన కేంద్రంను అందరూ ఉపయో గించుకోవాలి. ' అని విమలక్క అన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి, పలువురు రచయితలు, నాయకులు పాల్గొన్నారు