Konda Surekha : యాదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి : మంత్రి కొండా సురేఖ

Update: 2024-10-15 11:45 GMT

మంత్రి కొండా సురేఖ ( Konda Surekha ) వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మనవడి పుట్టు వెంట్రుకల మొక్కలు స్వామివారికి చెల్లించుకున్నామని తెలిపారు. మంత్రి అయిన తర్వాత ఇంతకుముందు కూడా స్వామివారి దర్శనం కోసం వచ్చామన్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఇక్కడ ఈవోను కూడా మార్చామని గుర్తు చేశారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. వచ్చే మాసంలో అభివృద్ధిపై సీఎం మీటింగ్ కూడా నిర్వహిస్తారని పేర్కొన్నారు. యాదాద్రి తరహాలో వేములవాడ కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. వేములవాడ రాజన్నకు 65 కేజీల బంగారం, 5000 కిలోల వెండి ఉంది. వెండి, బంగారాన్ని దేవుడి కార్య నిమిత్తం వాడుదామన్నారు. గీసుకొండ సంఘటనపై ప్రశ్నించగా ఇది దేవాలయం ఇక్కడ ఎలాంటి రాజకీయాలు మాట్లాడనని తేల్చి చెప్పారు.

Tags:    

Similar News