జేసీ దివాకర్‌రెడ్డిపై మండిపడ్డ కాంగ్రెస్ నేత వీహెచ్
జేసీ వ్యాఖ్యలు చూస్తుంటే.. కేసీఆర్ కోవర్ట్ అని అర్ధమవుతోందన్నారు వీహెచ్.;
VH hanumantharao
జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్. జేసీ తన రాజకీయాలు ఆంధ్రాలో చూసుకోవాలని చురకలంటించారు. జానారెడ్డి ఓడిపోతారని చెప్పడానికి జేసీ ఎవరని ప్రశ్నించారు. జేసీ జ్యోతిష్యాలు చెప్పడం మానుకోవాలన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడతారని హెచ్చరించారు. జేసీ వ్యాఖ్యలు చూస్తుంటే.. కేసీఆర్ కోవర్ట్ అని అర్ధమవుతోందన్నారు.