విజయవాడ- హైదరాబాద్ మధ్య ప్రయాణికులకు ఇది అదిరిపోయే ఆఫర్. కేవలం రూ.99లకే విజయవాడ నుంచి హైదారాబాద్‌కు, హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణించే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోంది. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా ఈటీవో మోటార్స్‌తో కలిసి ఫ్లిక్స్ బస్ ఆఫ్ ఇండియా ఓ సరికొత్త విద్యుత్ బస్సును అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే ఈ బస్సు విజయవాడ- హైదరాబాద్ మార్గంలో పరుగులు పెట్టనుంది. ఈ బస్సులో విజయవాడ- హైదరాబాద్ మధ్య ఛార్జిని కేవలం రూ.99కే అందిస్తున్నట్లు ఫ్లిక్స్ బస్ ఇండియా ఎండీ సూర్య తెలిపారు. ఈటీవో మోటార్స్‌తో కలిసి ఫ్లిక్స్ బస్ ఇండియా అందుబాటులోకి తెచ్చిన విద్యుత్ బస్సును రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈనెలలోనే హైదారాబాద్- విజయవాడ మధ్య ఈవీ బస్సులు నడిపేందుకు ఏర్పాట్లుచేస్తున్నట్లు ఈటీవో మోటార్స్ ఎండీ రాజీవ్, ఫ్లిక్ బస్ ఇండియా ఎండీ సూర్య తెలిపారు. ఆ తర్వాత విజయవాడ-విశాఖ మధ్య సైతం ఈ సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించారు. సర్వీసులు ప్రారంభమైన తర్వాత నెలరోజుల పాటు విజయవాడ- హైదరాబాద్ మధ్య నెలరోజుల పాటు కేవలం రూ.99 ఛార్జీ వసూలు చేయనున్నట్లు తెలిపారు. సాధారణ బస్సులకు ఈవీ మధ్య సామర్థ్యం విషయంలో ఏమాత్రం తేడా ఉండదని...కేవలం 5 గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకోవచ్చన్నారు.