మేదిగడ్డ కుంగడంపై వేగవంతమైన విజిలెన్స్ దర్యాప్తు

ఈఎన్సీ వెంకటేశ్వర్లుపై విజిలెన్స్‌ ప్రశ్నల వర్షం

Update: 2024-04-02 02:30 GMT

కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ కుంగడంపై విజినెల్స్‌ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మేడిగడ్డపై మాజీ ENC వెంకటేశ్వర్లుపై విజిలెన్స్‌ ప్రశ్నల వర్షం కురిపించింది.అదనపు TMC పనులకు ఎలా, ఏఅధికారంతో సిఫార్సు చేశారని ప్రశ్నించగా.. రికార్డులు చూసి వివరాలు చెబుతాననిసమాధానం ఇచ్చారు. అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు తర్వాత సమాధానం చెబుతానని తెలిపినట్లు సమాచారం. ఈనెల 8న మరోసారి విచారణకు రావాలని మాజీ ENC వెంకటేశ్వర్లుకి విజిలెన్స్‌ అధికారులు చెప్పారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక- DPR అంచనాలో...అదనపు TMCకి ఆస్కారం లేకపోయినా సివిల్‌ పనులకు అంచనాలు తయారుచేసినట్లు.. ప్రాజెక్టు మాజీ ఇంజినీర్‌ ఇన్‌చీఫ్‌ వెంకటేశ్వర్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు వెల్లడించారు. ఏ అధికారంతో ఆ విధంగా సిఫార్సు చేశారని ప్రశ్నించగా.. ప్రస్తుతం సమాధానం ఇవ్వలేనని.... రికార్డులు పరిశీలించిన తర్వాత చెప్తానని పేర్కొన్నట్లు తెలిసింది. సవరించిన అంచనాను ప్రభుత్వానికి పంపి............డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ ప్రారంభమైందని గుత్తేదారుకు బ్యాంకు గ్యారంటీలు వెనక్కి ఇవ్వాలంటూ ఎలా సిఫార్సుచేశారని ప్రశ్నించగా.....SE నివేదిక ఆధారంగా ఉన్నతస్థాయి కమిటీకి పంపానని చెప్పినట్లు తెలిసింది. పలు నిర్ణయాలకు కిందిస్థాయి ఇంజినీర్ల నివేదికలే ఆధారమని పేర్కొన్నారని.. అనేక అంశాలకు తర్వాత సమాధానం ఇస్తానని చెప్పినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌.. నిర్మాణంలో భాగస్వాములైన ఇంజినీర్లను విచారిస్తోంది. కీలకంగా వ్యవహరించిన మాజీ ENC వెంకటేశ్వర్లును ప్రశ్నించగా మిగిలిన ఇంజినీర్లను... త్వరలోనే విచారించనుంది. వెంకటేశ్వర్లుకు 30కి పైగా ప్రశ్నలు సంధించింది. ఒప్పందంమేరకు మేడిగడ్డ ప్రారంభంతో పని పూర్తైనట్లు భావిస్తున్నారా అని విజిలెన్స్‌ అధికారులు ప్రశ్నించగా.. లేదని ENC సమాధానమిచ్చారు. ప్రాణహిత-చేవెళ్ల పునరాకృతి ద్వారా కాళేశ్వరం ఎత్తిపోతల చేపట్టడానికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు అడిగినట్లు తెలిసింది. ఈ నెల 8న మరోసారి విచారణకు రావాలని పిలిచినట్లు సమాచారం.

 మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి పరిశీలించి తనిఖీ నోట్స్‌ ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించగా.. తనిఖీ చేసినట్లు వెంకటేశ్వర్లు చెప్పారు. అందుకు సంబంధించిన వివరాలను తర్వాత ఇస్తానని తెలిపారు. పనిలో సౌలభ్యం కోసం సీకెంట్‌ పైల్స్‌ అనుమతించాలని గుత్తేదారు కోరగా CDO చీఫ్‌ ఇంజినీర్‌కు పంపే ముందు ఫీల్డ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏమైనా చేశారా అని అధికారులు ప్రశ్నించగా... ఆర్ధికభారంపై విశ్లేషించినట్లు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఐతే అందుకు సంబంధించిన వివరాలను మాత్రం తర్వాత సమర్పిస్తానని తెలిపారు. అప్పటి సీఎం ప్రాజెక్టును పరిశీలించినపుడు ఆదేశించారని.. బ్యారేజీ ఎగువన, దిగువన సీసీ బ్లాకుల సైజులో మార్పు చేశారని.. కొత్త సైజు సీసీ బ్లాకులకు సిఫార్సు చేసే ముందు దీన్ని బలపరిచేలా మోడల్‌ స్టడీస్‌ టెక్నికల్ స్టడీస్‌ చేశారా అని అధికారులు అడగ్గా........అందుకోసం ఎలాంటి మోడల్‌ స్టడీస్‌ చేయలేదని వివరించారు.  

Tags:    

Similar News