TG : మల్లంపేట అక్రమ విల్లాల కేసులో విజయలక్ష్మి అరెస్ట్

Update: 2025-01-30 11:45 GMT

లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్‌ నిర్వాహకురాలు విజయలక్ష్మిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కుత్బుల్లాపూర్‌ మల్లంపేటలో అక్రమంగా లే అవుట్‌ వేసి విల్లాలు నిర్మించిన కేసులో విజయలక్ష్మి ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. పలు భూకబ్జా కేసులలో ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల లక్ష్మీ శ్రీనివా కన్‌స్ట్రక్షన్స్‌ విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అప్పటి నంచి పోలీసులకు దొరకకుండా విజయలక్ష్మి తప్పించుకు తిరుగుతున్నారు. విజయలక్ష్మి అరెస్ట్‌తో విల్లాల కేసులో పురోగతి కనిపించనుంది. 

Tags:    

Similar News