గోషామహల్ నియోజకవర్గ కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. మాజీమంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు, కాంగ్రెస్ నేత విక్రమ్‌గౌడ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గోషామహల్ డివిజన్ టికెట్ తన వర్గీయులకు ఇవ్వకపోతే.. కాంగ్రెస్‌కు రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు ఆయన సన్నిహితులు. ఇప్పటికే నియోజకవర్గంలోని 5 డివిజన్లలో నామినేషన్ వేసిన అభ్యర్థులు కూడా వాటిని ఉపసంహరించుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో గ్రేటర్ టికెట్ల లొల్లి కాంగ్రెస్ పార్టీకి పార్టీకి తలనొప్పిగా మారింది.