KTR : బ్రేక్ డ్యాన్సులు చేయొచ్చన్న కేటీఆర్.. సీతక్క మళ్లీ ఫైర్

Update: 2024-08-16 05:30 GMT

మంత్రి సీతక్క, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బస్సుల్లో మహిళలు ఎల్లిపాయ, అల్లం పొట్టు తీయడం తప్పెలా అవుతుందన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలపై స్పందిస్తూ కేటీఆర్ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపాయి.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్స్ లు వేసుకోవచ్చు అంటూ కేటీఆర్ కామెంట్ చేయడంతో సీతక్క మండిపడ్డారు. మీ ఇంట్లో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఇలాగే డ్యాన్స్ చేస్తారంటూ సీతక్క ఫైర్ అయ్యారు. కేటీఆర్ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. కేటీఆర్ ఓ మంత్రిగా ఎలా చేశారో అర్థం కావడం లేదన్నారు. అల్లం ఎల్లిపాయలు .. మంత్రి సీతక్క, కేటీఆర్ మధ్య మాటల మంటలు పెంచాయి.

Tags:    

Similar News