Warangal : కాకతీయ యూనివర్సిటీలో ఎలుకల బెడద
పలువురు స్టూడెంట్స్ కాళ్ళను కొరకడంతో వారికి గాయాలయ్యాయి;
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ హాస్టల్‌లో ఎలుకల బెడద వేధిస్తోంది. రాత్రి వేళ నిద్రిస్తున్న విద్యార్థులపై ఎలుకలు దాడి చేస్తున్నాయి. పలువురు స్టూడెంట్స్ కాళ్ళను కొరకడంతో వారికి గాయాలయ్యాయి. దీంతో హాస్టల్ నిర్వాహకులకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఇకపై ఎలుకల బెడద లేకుండా చేస్తామని హాస్టల్ నిర్వాహకులు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు కాలేజీలోనూ ఎలుకలు దాడి చేస్తుండటంతో యూనివర్సిటి సిబ్బందిపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్టూడెంట్స్‌కు ఎలుకల బెడద లేకుండా చూడాలని కోరుతున్నారు.