Minister Jupally : బౌద్ధ వారస్వత కేంద్రాలకు జీవం పోస్తున్నం : మంత్రి జూపల్లి

Update: 2025-05-13 05:31 GMT

గౌతమ బుద్దుని ఆదర్శాలే ప్రజా ప్రభుత్వానికి మార్గదర్శమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గౌతమ బుద్ధుని జయంతి, బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్ష లు తెలిపారు. మానవాళి ప్రగతి కోసం బౌద్ధం చూపిన బాట నేటికీ ఆచరణీయమన్నారు. 'తెలంగాణ సమాజపు మానవత్వ పరిమళా లు, శాంతి సహనంతో కూడిన అహింసాయుత జీవన విధానం.. వీటిలోని మూలాలు బౌద్ధ వా రసత్వం నుంచే అలవడ్డాయి. అరుదైన బౌద్ధ చారిత్రక సంపద.. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాలను అల్లుకొని తెలంగాణలో బౌద్ధం పరిఢవిల్లిందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. నాగార్జున సాగర్ బుద్ధవనం అంతర్జా తీయ బౌద్ధ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నం. రా ష్ట్రంలోని బౌద్ధ వారసత్వ కేంద్రాలను పునరుజ్జీ వింపచేసి ప్రపంచ బౌద్ధ పటంలో తెలంగాణకు సముచిత స్థానాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ' అని మంత్రి జూపల్లి అన్నారు.

Tags:    

Similar News