TG : గత 50 ఏళ్ల లో ఇంతటి భారీ వర్షాలను చూడలేదు : మంత్రి దామోదర

Update: 2025-08-28 11:45 GMT

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ మెదక్ జిల్లాలోని రామాయంపేట లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులతో ఆయనమాట్లాడారు . లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సహాయక చర్యలను చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు . గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల రామాయంపేట జలదిగ్బంధంలో చిక్కుకుందన్నారు . గత రెండు రోజుల నుండి భారీ వర్షాలలో చిక్కుకున్న 60 మందిని జిల్లా డిజాస్టర్ యంత్రాంగం ,రెవిన్యూ , పోలీసులు , వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కాపాడారన్నారు . ఇద్దరూ వ్యక్తులు గల్లంతయ్యారన్నారు . వరదల్లో కొట్టుకుపోయిన ఒకరి మృతదేహం లభించిందని మంత్రి వెల్లడించారు . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో ఉందన్నారు . జిల్లా కు చెందిన ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను కాపాడే పనిలో నిమగ్నమై ఉన్నారన్నారు. వరద ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో మంత్రి టెలిఫోన్లో సమీక్షించారు. గత 50 ఏళ్ల లో ఇంతటి భారీ వర్షాలను చూడలేదని స్థానిక ప్రజలు మంత్రికి తెలిపారు.

మెదక్ జిల్లాలోని రామాయంపేట లోని కామారెడ్డి రోడ్ లో ఉన్న బీసీ కాలనీ నీటి మునిగిన ఇండ్లను వరదని ఉద్రిత్తిని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరిశీలించారు. రామాయంపేటలోని వరద ప్రభావిత ప్రాంతాలను లోతట్టు ప్రాంతాలను మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారితో కలిసి మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి నిత్యవసర వస్తువులను భోజనాలను బట్టలను బెడ్ షీట్లను అందజేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. నిజాం పేట మల్క చెరువు , కోనాపుర్ , నందిగామ రోడ్డు లో దెబ్బ తిన్న బ్రిడ్జి , సాయి చెరువు అలుగు లను క్షేత్ర స్థాయిలో మంత్రి దామోదర్ రాజనర్సింహా పరిశీలించారు.

వచ్చే రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలు రెవిన్యూ ,పోలీస్ ,డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందికి సహకరించాలని మంత్రి ప్రజలకు సూచించారు. భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సురక్షితమైన ప్రదేశాలలో ఉండాలని సూచించారు. దెబ్బతిన్న ఇండ్లు , పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లు పరిశీలించారు. ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో ఉందన్నారు జననష్టం జరగకుండా నష్ట నివారణ చర్యలను చేపడుతున్నామన్నారు .దెబ్బతిన్న రోడ్లను త్వరలో పునరుద్ధరిస్తామన్నారు. పంట నష్టం .ఆస్తి నష్టం అంశాలను రెవిన్యూ యత్రాంగం అంచనా లు రూపొందిస్తున్నారన్నారు . గత 50 ఏళ్ల చరిత్రలో ఇంతటి వర్షం కురవలేదన్నారు . రామాయంపేట , కామారెడ్డి, మెదక్ లలోని కొన్ని మండలాలలో, ప్రాంతాలలో సుమారు 200 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదయింద అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందని మంత్రి వెల్లడించారు. ప్రజలకు పూర్తి అండగా ప్రభుత్వ యంత్రాంగం ఉందన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహా . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రులు , రాష్ట్ర , జిల్లాస్థాయి అధికారులు నిరంతరం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహా 

Tags:    

Similar News