ఫ్రంట్‌లైన్ వారియర్లుగా జర్నలిస్టులు : డీహెచ్
జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 28 నుంచి జర్నలిస్టులందరికీ సమాచార ప్రసారాల శాఖ ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామని డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు.;
జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 28 నుంచి జర్నలిస్టులందరికీ సమాచార ప్రసారాల శాఖ ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు. అటు రాష్ట్రంలో ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాలను 1200కు పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లుగా తెలిపారు. ఇక కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ సత్ఫలితాలను ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాటివిటీ రేటు 4.1శాతంగా ఉందన్నారు. ఇక రికవరీ రేటు 92.52శాతంగా ఉందన్న ఆయన.. మరణాల రేటు 0.56శాతంగా ఉందని తెలిపారు. ఇప్పటివరకు 1.47కోట్ల కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.