హుజురాబాద్‌ ఉపఎన్నికలో పోటీ చేస్తాం: కోదండరాం

టీజేఎస్‌ విలీనమంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.;

Update: 2021-07-11 10:08 GMT

హుజురాబాద్‌ ఉపఎన్నికలో పోటీ చేస్తామని ప్రకటించారు టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం. టీజేఎస్‌ విలీనమంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. తెలంగాణ అమరవీరుల ఆశయ సాధనకు టీజేఎస్ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. పైసలు కుమ్మరించి గెలవాలన్నదే టీఆర్ఎస్ తాపత్రయమని విమర్శించిన కోదండరాం.. ఆగస్టులో పార్టీ ప్లీనరీ నిర్వహించి అన్ని నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఏపీతో తెలంగాణ ప్రభుత్వం కుమ్మక్కై నీటి పంచాయితీపై నాటకమాడుతోందన్నారు ప్రొఫెసర్‌ కోదండరాం.

Tags:    

Similar News