తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడితే కేటీఆర్, హరీశ్‌రావు నాలకను ప్రజలు కోస్తరని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హెచ్చరించారు. తెలంగాణ తల్లిని చూస్తే చాకలి ఐలమ్మ,ఉద్యమ కారులు పేదోళ్ల గుర్తొస్తారన్నారు. లిక్కర్ రాణి కవిత కూడా తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లి అంటే ఒకవైపు డబ్బు మరోవైపు లిక్కర్ సీసా ఉండాలా అని ప్రశ్నించారు. గడిల తల్లి కాదు.. గరీబోళ్ల తల్లి కావాలని సీఎం రేవంత్‌రెడ్డి అనుకున్నారని ఐటయ్య తెలిపారు.