Minister Sridhar : తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా నిలబెడతాం : శ్రీధర్ బాబు
రానున్న పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అంతర్జాతీయ ఏఐ కంపెనీ ఫినోమ్ తన మొదటి ఐయామ్ ఫినోమ్ ఇండియా సదస్సును మాదాపూర్ లోని ఓ హోటల్లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి శ్రీధర్ బాబు హాజరై మాట్లాడారు. ఐయామ్ ఫినోమ్ ఇండియా ఇలాంటి సంచలనాత్మక కార్యక్రమాన్ని నిర్వ హించడం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు. భారత ఆర్థిక ఆశయాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామికశక్తిని రూపొందించడంలో ఏఐ ఆధారిత వినూత్నత ప్రధానమైనదని పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వంటి కార్యక్రమాల ద్వారా తాము టాలెంట్ డెవలప్మెంట్ పై దృష్టి సారించామని తెలిపారు.