Minister Tummala : కొత్తగూడెంను మోడల్ జిల్లాగా మారుస్తం : మంత్రి తుమ్మల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, రాష్ట్రంలో మోడల్జిల్లాగా మారుస్తామని వ్యవసా యశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ కొత్తగూడెం టౌన్లో రూ. కోటిన్నర నిధులతో జిల్లా గ్రంథాలయ భవ నాన్ని ఆయన ప్రారంభించి ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను తెలంగాణలోనే ధనిక జిల్లాగా అభి వృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. త్వరలోనే కొత్తగూడెంలో ఎయిర్పోర్టు తో పాటుగా యూనివర్సిటీ బైపాస్ రోడ్లు రాను న్నాయని తెలిపారు.‘ జిల్లాను సమగ్ర అభివృ ద్ధి చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్న. గ్రంథాలయాల్లో విద్యార్థులకు అవసరమైన బుక్స్ ను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపట్టాలి. శ్రీ రాముడు నడియాడిన ప్రాంతం కాబట్టి గొప్పగా అబివృద్ధి జరగా ల్సిన అవసరం ఉంది. అమరావతి నుండి కొత్తగూడెం మీదుగా హైవే రోడ్డును నిర్మి స్తం. పండురంగాపురం నుండి భద్రాచలం వరకు రైల్వే లైన్ సర్వే రిపోర్ట్ రెడీ అయింది. ఇప్పటికే ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్రా నికి రిపోర్ట్ ఇచ్చాం. ఇలా కొత్తగూడెంలో రోడ్డు, రైల్, విమానం, నౌకాయానం అన్ని అందుబాటులో తెచ్చి గొప్పగా అభివృద్ధి చేస్తం. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ని కొత్త గూడెం లో ఏర్పాటు చేయాలనే ఆలోచలన లో ప్రభుత్వం ఉంది. పాల్వంచకు బైపాస్ నిర్మాణానికి ప్రపోజల్చేశాం. కొత్తగూడెంకు రింగ్ రోడ్డు ఏర్పాటు చేసుకోవచ్చు. పిల్లల్ని గంజాయి నుంచి దూరంగా ఉండాలి. మత్తు పదార్థాలను నివారించాలి. పేరెంట్స్ పిల్లల పై దృష్టిపెట్టాలి. జిల్లా గ్రంథాలయంలో అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తెస్తం. విద్యార్థులు, నిరుద్యోగులు మంచిగా ఉప యోగించుకోవాలి. ' అని తుమ్మల అన్నారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండలంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవా లు చేశారు. సమావేశంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ తదితరు లు పాల్గొన్నారు.