Telangana Rains : ఆ తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు..
Telangana Rains : తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ.;
Telangana Rains : తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 7-9 మధ్య అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని...8, 9 తేదీల్లో 20 సెంటీమీటర్ల పైన అత్యంత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, విపత్తు నిర్వహణ బృందాలకు సమాచారం ఇచ్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం ఏర్పడిన ఆవర్తనం ఏపీ కోస్తా తీరం పరిసర ప్రాంతాల్లోని బంగాళాఖాతంలో కొనసాగుతోందని తెలిపింది.