వాతావరణశాఖ హెచ్చరిక.. ఐదు రోజులు భారీ వర్షాలు..

ద్యావుడా.. వచ్చే ఐదు రోజులు వర్షాలట.. జాగ్రత్త సుమీ!! నగరంలో వర్షం పడితే నరకమే..

Update: 2023-09-13 08:16 GMT

ద్యావుడా.. వచ్చే ఐదు రోజులు వర్షాలట.. జాగ్రత్త సుమీ!! నగరంలో వర్షం పడితే నరకమే.. మామూలుగానే సమయానికి ఇంటికి చేరుకోవడం కష్టం.. ఇక వర్షం పడితే నగర పౌరుడి బాధ వర్ణనాతీతం. అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు వర్షం పడితే ఎక్కడ రోడ్డు ఉందో, ఎక్కడ గుంట ఉందో అర్థం కాదు.. అయినా మన పాలకులకు పట్టదు.. ఇప్పుడు మళ్లీ వచ్చే ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.

వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం నుంచి కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేటి నుంచి శనివారం వరకు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

ఏపీలోను వర్షం..

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తర కోస్తాలోని అనేకచోట్ల, దక్షిణకోస్తాలోని కొన్ని చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది.

Tags:    

Similar News