TG : తెలంగాణలో విచిత్ర వాతావరణం.. ఒకేరోజు వాన, ఎండ, చలి

Update: 2024-10-26 14:00 GMT

తెలంగాణలో కొద్దిరోజులుగా కొనసాగుతున్న విభిన్న వాతావరణం మరికొద్దిరోజులు కొనసాగనుంది. ఎండ, వాన.. ఇలా కొద్ది నిమిషాల్లోనే వెదర్ మారిపోయే పరిస్థితులు కొనసాగనున్నాయి. పలు ప్రాంతాల్లో ఎండాకాలాన్ని తలపిస్తూ.. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక సాయంత్రానికి ఉన్నట్లుండి వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి 10 గంటల తర్వాత, తెల్లవారుజామున విపరీతమైన చలి ఉంటోంది. ఉదయం 9 దాటగానే ఎండ పెరిగిపోతోంది. దీనికి తోడు.. శని, ఆదివారాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News