TGRTC Driver : శభాష్ డ్రైవరన్న.. నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్

Update: 2025-07-08 07:15 GMT

మధిర డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ నిజాయితీ చాటుకున్నారు. ప్రయాణికుడు బస్సులో మరిచిపోయిన రూ.10 లక్షల సొత్తుతో కూడిన బ్యాగ్ ను అతడికి అప్పగించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన హనుమంతరావు హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి బోనకల్ క్రాస్ రోడ్ వరకు మధిర సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణం చేశారు. బస్సు దిగే సమయంలో తాను కూర్చున్న సీటులోని బ్యాగును తీసుకోవడం మరిచిపోయారు. బస్సు డిపోకు చేరిన తర్వాత బ్యాగును గమనించిన డ్రైవర్ వెంకటేశ్వర్లు విషయాన్ని డిపో మేనేజర్ శంకర్రావుకు చెప్పారు. దీంతో అధికారులు ప్రయాణికుడి వివరాలు సేకరించి అతడికి బ్యాగును అందజేశారు. అందులో రూ.2 వేల నగదుతో పాటు మొత్తం రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. సదరు ప్రయాణికుడికి సమాచారం ఇచ్చి బ్యాగ్‌ను ట్రాఫిక్‌ ఇన్‌చార్జ్‌ వెంకటేశ్వర్లు, కంట్రోలర్‌ కాలేషా సమక్షాన అందజేశారు. తాను మరిచి పోయిన సొమ్మును తిరిగి తనకు అప్పగించిన ఆర్టీసి అధికారులు, సిబ్బందికి ప్రయాణికుడు కృతజ్ఞతలు చెప్పారు.

Tags:    

Similar News