ఎవరీ వాణీదేవి... ఆమె హై ప్రొఫైల్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే.. !
హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్ధి వాణీదేవి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావు పైన ఆమె విజయం సాధించారు. దీనితో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది.;
హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్ధి వాణీదేవి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావు పైన ఆమె విజయం సాధించారు. దీనితో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఫలితాలు వెలువడిన అనంతరం కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయారు బీజేపీ ఏజెంట్లు.. అటు వాణీదేవి విజయంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎవరీ వాణిదేవి అనే చర్చ అందరిలో మొదలైంది.. ఆమెకి సంబంధించిన కొన్ని వివరాలు మీకోసం..!
మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి
1952, ఏప్రిల్ 1న కరీంనగర్ జిల్లా వంగరలో జన్మించిన వాణీదేవి
హైదరాబాద్ హైదర్‌గూడలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యాభ్యాసం
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బీఏ డిగ్రీ
జేఎన్టీయూ నుండి ఫైన్ ఆర్ట్స్‌లో డిప్లొమా
1990-1995 జేఎన్టీయూలో లెక్చరర్‌గా పనిచేసిన వాణీదేవి
1973 నుండి దేశవిదేశాల్లో చిత్రకారిణిగా 15కి పైగా..
సోలో ఎగ్జిబిషన్లు, అనేక గ్రూప్ షోలు, సెమినార్లు నిర్వహణ
2016లో ఇంటర్నేషనల్ విమెన్స్ అచీవ్‌మెంట్ అవార్డు
2017లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం
3 దశాబ్దాలుగా విద్యారంగంలో కృషిచేస్తోన్న వాణీదేవి
శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ
శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ విద్యాసంస్థలను స్థాపించిన వాణీదేవి