CPI Narayana : సినిమా నటులకు పాడు సంపాదన ఎందుకు : సీపీఐ నారాయణ

Update: 2025-03-22 08:30 GMT

సినిమా నటులకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల ద్వారా వచ్చే పాడు సంపాదన ఎందుకని సీపీఐ జనరల్ సెక్రటరీ నారాయణ ప్రశ్నించారు. సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపును తప్పుడు పనులకు దుర్వినియోగం చేయోద్దని హితవు పలికారు. గతంలో చిరంజీవి కోకాకోలా యాడ్ ఇచ్చేవారని అయితే రక్తదానం చేస్తూ రక్తాన్ని దెబ్బతీసే డ్రింక్‌లను ఎలా ప్రమోట్ చేస్తారని ప్రశ్నించానని తెలిపారు. ఆ తర్వాత అటువంటి చేయనని చిరంజీవి తనతో చెప్పారన్నారు. ఓవైపు రక్తదానం చేస్తూ.. మరోవైపు రక్తాన్ని దెబ్బతీసే డ్రింక్‌లను ఎలా ప్రమోట్ చేస్తారు? అని ఆయన్ని ప్రశ్నించా. కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఆ ప్రకటనలు చేయనని ఆయన చెప్పారు. ఆ తర్వాత చెయ్యలేదు కూడా’’ అని నారాయణ అన్నారు.

Tags:    

Similar News