BJP : కీలక సామాజిక వర్గానికి చెందిన నేతకే బీజేపీ పగ్గాలు..?

Update: 2024-08-19 10:45 GMT

2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని భావిస్తోన్న బీజేపీ అందుకు పకడ్బందీ వ్యూహాలతో ముందుకు వెళుతోంది. రాష్ట్రంలో కమలం పార్టీ వికాసానికి గట్టి పోటీ ఇస్తున్న అధికార కాంగ్రె న న్ను చిత్తుచేసేలా వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రధానంగా రాష్ట్రంలో కాం గ్రెస్ను బలంగా ఎదుర్కొనే సత్తా ఉన్న నేతనే బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా నియమించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో పీసీసీ కొత్త అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని నియమిస్తుందో నిశితంగా గమనిస్తోంది.

పీసీసీ నూతన అధ్య క్షుడి నియామకం తర్వాతే బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి నియామకం ఉండబోతోందన్న చర్చ బీజేపీ వర్గాల్లో విస్తృతంగా కొనసాగుతోంది. ఏ సామాజిక వర్గానికి చెందిన నేతకు కాంగ్రెస్ పీసీసీ నూతన అధ్యక్షుడి బాధ్యతలు అప్పగిస్తే... అదే సామాజికవర్గానికిచెందిన నేతకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించేయోచనలో ఉన్న నేపథ్యంలో బీజేపీ కూడా అదే ఫార్మాలాను తెలంగాణలో ప్రయోగించనుందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి ఎంపిక అంశాన్ని బీజేపీ అధిష్టానం తాత్సారం చేస్తోందన్న చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతకు సీఎం పదవి ఇచ్చింది. దీంతో బీజేపీ కూడా అసెంబ్లీలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పార్టీ శాసనస భాపక్ష నేతగా నియమించింది. కాళేశ్వరం మొదలు రుణమాఫీ, ధాన్యం కొను గోళ్లు తాజాగా సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయిన అంశాల్లో ఏలేటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పదునైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. పలు నిరసన కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వాన్నిధీటుగా ఎదుర్కొ౦టున్నారు. సభలో అధికార కాంగ్రెస్ ను ధీటుగా ఎదుర్కొంటున్నట్టే అసెంబ్లీ బయట కూడా ప్రజల్లో కాంగ్రెస్ ను ధీటుగా ఎదుర్కోంటేనే పార్టీకి రాష్ట్రంలో ప్రజాభిమానం దక్కుతుందని కమలనాథులు భావిస్తున్నారు. కాంగ్రెస్ కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక తర్వాతే బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి ఎంపిక ఉండబోతోందన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

Tags:    

Similar News