గత అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ డుమ్మా కొట్టారు. కానీ, ఈ సారి సమావేశాలకు తాను హాజర వుతానని ఇటీవలే ప్రకటించడంతో రాబోయే సమావేశాలపై ఆసక్తి నెలకొంది. పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరిన్ని వలసలు జరుగుతాయనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఫిరాయింపుల చట్టంపై చర్చించే అవకాశం ఉంది.
అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారెంటీ ల అమలుపైనా ప్రశ్నలు గుప్పించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇది వరకే మెజారిటీ గ్యారెంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినప్పటికీ ఇంకా గృహలక్ష్మీ కింద ప్రతి ఇంటి మహిళకు రూ. 2,500 ఆర్థిక సాయంతో తదితర ఎన్నికల హామీలు మరికొన్ని పెండింగ్లోనే ఉన్నాయి. దీంతో.. ఈసారి అసెంబ్లీ వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది. ఐతే.. కేసీఆర్ హాజరై మాటనిలబెట్టుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.