TG : మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా : మంత్రి కోమటిరెడ్డి
కాంగ్రెస్ పార్టీ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి రాని పక్షంలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే కేటీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా..? అందుకు ఆయన సిద్ధ మేనా..? అంటూ సవాల్ విసిరారు. కేటీఆర్ కు ఎల్ఎల్బీసీ ఎక్కడుందో తెలియదని అన్నారు. తాము ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యా రెంటీల్లో ఐదింటిని అమలు చేశామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు ను విదేశాల్లో దాచి పెట్టింది బీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. ప్రభాకర్ రావు అమెరికా నుంచి వస్తే కేసీఆర్ ఫ్యామిలీకి జైలు తప్పదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్స్ చేయదని చెప్పారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టు కోవాలని సూచించారు. బీఆర్ఎస్ సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం బాధాకరమని అన్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ రాలేదని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీకి ఉనికే లేద న్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన రెండు, మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతాయని చెప్పారు. రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నల్లగొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే సాగునీటి కష్టాలు తప్పేపన్నారు.