నగరంలో ఆ రెండు రోజులు వైన్ షాపులు బంద్..
ఈనెల 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసి వేయాలని సిటీ పోలీస్ కమిషనరేట్ ఆదేశాలు జారీ చేసింది.;
ఈనెల 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసి వేయాలని సిటీ పోలీస్ కమిషనరేట్ ఆదేశాలు జారీ చేసింది. బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ ఈస్, సౌత్ వెస్ట్ జోన్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజ్ గిరి జోన్, ఎల్బీనగర్ జోన్, మహేశ్వరం జోన్ పరిధిలో ఒక రోజు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆయా కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ ఆంక్షలు ఆదివారం అమల్లో ఉండనున్నాయి.