Husband Harassment : వ్యవసాయ బావిలో దూకి వివాహిత ఆత్మహత్య

Update: 2025-03-01 11:15 GMT

వేములవాడ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వేములవాడ లోని గాంధీనగర్కు చెందిన మ్యాన పల్లవి (23) చెక్కపల్లి రహదారిలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

శనివారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లి గ్రామానికి చెందిన పల్లవికి.. వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ చెందిన శివతో మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఏడాది వరకు బాగానే ఉన్న భార్యభర్తలు.. ఆ తర్వాత వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ మధ్యకాలంలో కలహాలు అధికమవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన పల్లవి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News