హైదరాబాద్‌లో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందింది. మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బంజారాహిల్స్ లోని నందినగర్‌లో చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా ఈ ఘటనకు ఫుడ్ పాయిజన్ కారణమని అధికారులు భావిస్తున్నారు. అందులో కలిపే మయోనైజ్ కలుషితం అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.