Narayanpet: కొడుకు ఆరోగ్యం బాగోలేదని మహిళ క్షుద్రపూజలు.. చెరువులో మేకను కోసి..
Narayanpet: నారాయణపేట జిల్లా మద్దూరు మండలం మోతుకుంట చెరువులో క్షుద్రపూజలు కలకలం రేపాయి.;
Narayanpet: నారాయణపేట జిల్లా మద్దూరు మండలం మోతుకుంట చెరువులో క్షుద్రపూజలు కలకలం రేపాయి. మోతుకుంటగ్రామంలోని ఓ మహిళ తన కొడుక్కు మతిస్థిమితం లేకపోవడంతో దామరగిద్దమండలం పేరపల్లి గ్రామంలోని మాంత్రికుడి వద్దకు వెళ్లింది. క్షుద్రపూజలు చేస్తే కొడుకు ఆరోగ్యం బాగుపడుతుందని అతడు నమ్మించాడు.
అలా మధ్యాహ్నం సమయంలో మోతుకు కుంట చెరువులో బసప్ప, కృష్ణ, పెట్యనాయక్ లు కుండలో మేకను బలిఇచ్చి పూజలు చేసి చెరువు నుంచి బయటకు వస్తుండగా.. మత్స్యకారులు చూసి వారిని ప్రశ్నించారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో వారికి దేహశుద్ది చేశారు. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా.. గ్రామపెద్దలు ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు. దీంతో ఈవిషయం కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.